ఐదేళ్లు ప్రీమియం.. జీవితాంతం ఆదాయం

30 Nov, 2023 07:20 IST|Sakshi

ఎల్‌ఐసీ కొత్ల ప్లాన్‌ జీవన్‌ ఉత్సవ్‌ఏటా 10 శాతం ఆదాయం

న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ ‘జీవన్‌ ఉత్సవ్‌’ పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ఆవిష్కరింంది. ఇది నాన్‌ లింక్డ్‌ (ఈక్విటీయేతర), నాన్‌ పార్టిసిపేటింగ్, మనీ బ్యాక్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పథకం. ఈ ప్లాన్‌లో నిర్ణీత కాలం తర్వాత నుం ఏటా 10 శాతం చొప్పున (సమ్‌ అష్యూర్డ్‌లో) వెనక్కి వస్తుంది. కనీస బీమా ర.5,00,000. గరిష్ట బీవ కవరేజీకి పరిమితి లేదు. 5–16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లింపుల కాలాన్ని ఎంపిక చేసుకోవచ్చు. గరిష్టంగా 65 ఏళ్ల వరకు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 

రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ లేదా ఫ్లెక్సీ ఇన్‌కమ్‌లో ఒక ఆప్షన్‌ ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ చెల్లింపుల కాలంలో మరణింనట్టయితే సమ్‌ అష్యూర్డ్‌కు తోడు, గ్యారంటీడ్‌ అడిషన్స్‌ కలిపి చెల్లిస్తారు. ప్రతి వెయ్యి రపాయలకు ఏటా ర.40 చొప్పున గ్యారంటీడ్‌ అడిషన్‌ లభిస్తుంది. ఇలా ప్రీమియం చెల్లింపుల కాలం వరకు ఏటా జమ అవుతుంది. 

ప్రీమియంను సకాలంలో చెల్లించడంలో విఫలమైతే గ్యారంటీడ్‌ అడిషన్స్‌ను దాని కింద సర్దుబాటు చేస్తారు. రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ ఆప్షన్‌లో ప్రీమియం చెల్లింపుల కాల వ్యవధి ముగిసిన మూడేళ్లు లేదా ఆరేళ్ల తర్వాత నుం ఏటా 10% ఆదాయం లభిస్తుంది. ఉదాహరణకు 5 ఏళ్లు ఎంపిక చేసుకుంటే 8 ఏళ్లు లేదా 11వ ఏట నుంచి ఏటా 10% ఆదాయం అందుకోవచ్చు. పదేళ్ల ప్రీమియం చెల్లింపుల కాలం ఎంపిక చేసుకుంటే 13వ ఏట నుంచి ఆదాయం వస్తుంది. ఫ్లెక్సీ ఇన్‌కమ్‌ ఆప్షన్‌లోనూ ఏటా 10% ఆదాయం అందుకోవచ్చు.

మరిన్ని వార్తలు