‘దయ చేసి నమ్మకండి.. అవన్నీ అవాస్తవాలే’, నెటిజన్లను కోరిన రతన్‌ టాటా!

27 Jun, 2023 19:57 IST|Sakshi

రతన్‌ టాటా..పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లోని దిగ్గజ పారిశ్రామికవేత్త. గొప్ప మానవతావాది..దాతృత్వం కలిగిన వ్యక్తి. టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకొన్నా.. టాటా ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా కొనసాగుతూ సమాజానికి తనవంతు సాయం చేస్తున్నారు. 

తాజాగా, ఆన్‌లైన్‌లో తన పేరుతో జరుగుతున్న మోసాలపట్ల నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని రతన్‌ టాటా కోరారు. ‘దయచేసి అప్రమత్తంగా ఉండండి. నేను ఏ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టలేదు. ఏ క్రిప్టోకరెన్సీ సంస్థలతో సంబంధం లేదు’ అని అన్నారు.

క్రిప్టోకరెన్సీ కంపెనీలతో తనకు సంబంధం ఉందని ఏవైనా కథనాలు లేదా ప్రకటనలను మీరు చూసినట్లయితే, అవి పూర్తిగా అవాస్తవమని, పౌరులను మోసం చేయడానికి ఉద్దేశించినవి అని రతన్‌ టాటా విజ్ఞప్తి చేశారు. క్రిప్టో మోసాలకు సంబంధించి ఓ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేశారు.

చదవండి👉 రూ.5.3 ​కోట్ల ఫ్లాట్‌ కేవలం రూ.11లక్షలే.. ఎలా సాధ్యం? 

మరిన్ని వార్తలు