Zomato:ట్విటర్‌లో రిజెక్ట్‌ జోమాటో..! స్పందించిన జోమాటో వ్యవస్థాపకుడు..!

19 Oct, 2021 20:07 IST|Sakshi

చెన్నై: హిందీ భాష నేర్చుకోవాలంటూ ఓ కస్టమర్‌పై జోమాటో ఎగ్జిక్యూటివ్‌ చేసిన ఎపిసోడ్‌లో  జోమాటో కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్‌పై దురుసుగా ప్రవర్తించిన కస్టమర్‌ఎగ్జిక్యూటివ్‌ను జాబ్‌ నుంచి తీసివేసిన కొన్ని గంటల్లోనే అతడిని తిరిగి మరల నియమిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ మొత్తం ఎపిసోడ్‌పై జోమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ ట్విటర్‌లో స్పందించారు.

దీపిందర్‌ గోయల్‌ తన ట్విట్‌లో..ఒక కస్టమర్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలియక చేసిన తప్పును జాతీయ సమస్యగా చిత్రించడం బాధకరమని అన్నారు. ఇక్కడ ఎవరినీ నిందించాలో తెలియడం లేదన్నారు. అంతేకాకుండా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల భాషలను నేర్చుకోవడానికి సమయం పడుతుందన్నారు. కంపెనీలోని ఉద్యోగులు ఆయా రాష్ట్రాల భాషల్లో నిష్ణాతులు కారని పేర్కొంటూనే... అంతేందుకు తనకు కూడా ఆయా రాష్ట్రాల భాషలు, ప్రాంతీయ భావాలు తెలియదన్నారు. మనమందరం ఒకరి లోపాలను మరొకరు సహించాలని తెలిపారు. దేశాన్ని ఏవిధంగా గౌరవిస్తామో.. ఇతర ప్రాంతాలను అంతే స్థాయిలో గౌరవిస్తామని తెలిపారు. 

అంతకుముందు ఏం జరిగిదంటే..!       
తమిళనాడు రాష్ట్రానికి చెందిన వికాస్ అనే కస్టమర్ జొమాటోలో  ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. అయితే ఆర్డర్ రిసీవ్ చేసుకున్న వికాస్ తాను ఇచ్చిన ఆర్డర్ లో ఒక ఐటమ్‌ మిస్ కావడంతో, తన ఆర్డర్ లో ఒక ఐటమ్‌ రాలేదని గమనించి జొమాటో కస్టమర్ సర్వీస్ కు సంప్రదించాడు. తనకు హిందీ రాదనే నెపంతో రిఫండ్‌ చేయలేదని వికాస్‌ ఆరోపించాడు. వికాస్‌  జోమాటో కస్టమర్‌ ఎగ్జిక్యూటివ్‌తో చేసిన సంభాషణను స్క్రీన్‌షాట్స్‌తో సహా ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వ్యవహారంపై తమిళ ప్రజలు #Reject_Zomato అంటూ ట్విటర్‌లో ట్రెండ్‌ చేశారు. అంతేకాకుండా డీఎమ్‌కే నాయకురాలు కనిమొళి కూడా స్పందించారు. 

జోమాటో వివాదం మరింత ముదురుతుండడంతో దిగొచ్చిన జొమాటో కస్టమర్ తో పాటుగా తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. వెంటనే సదరు సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ను విధుల నుంచి తొలగించింది. ప్రజలు తమను తిరస్కరించ వద్దని కోరుతూ వణక్కం అంటూ తమిళ భాషలో నమస్కరించి తమిళ ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసింది జొమాటో. 


చదవండి: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి దూసుకొస్తున్న కొత్త కంపెనీలు

మరిన్ని వార్తలు