రిలయన్స్‌ సబ్సిడరీకి ‘సిన్‌గ్యాస్‌’ బదిలీ

26 Nov, 2021 08:11 IST|Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన జామ్‌నగర్‌ సిన్‌గ్యాస్‌ ప్రాజెక్టును పూర్తి స్థాయి అనుబంధ సంస్థకు బదలాయించనుంది. ఈ ప్రాజెక్టుకు మరింత విలువను చేకూర్చడమే ఈ చర్యల ప్రధానోద్దేశమని రిలయన్స్‌ ప్రకటించింది. ఇంధన ఉత్పత్తిలో ఉపయోగించే ఈ సిన్‌గ్యాస్‌ (సింథసిస్‌ గ్యాస్‌) అనేది హైడ్రోజన్, కార్బన్‌ మోనాక్సైడ్‌ అలాగే కొంత మొత్తంలో కార్బన్‌ డయాక్సై డ్‌లతో కూడిన సమ్మేళనం. ఘన హైడ్రోకార్బన్‌ ఇంధనాన్ని గ్యాసిఫికేషన్‌ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. ‘ఈ బదలాయింపు అనేది సిన్‌గ్యాస్‌ విలువను అన్‌లాక్‌ చేయడానికి తోడ్పడుతుంది అలాగే కంపెనీ ప్రధాన ఇంధన వనరుగా పునరుత్పాదకాల వైపు మళ్లడానికి సహాయపడుతుంది’ అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది.

ఇంధన వ్యయాల్లో తీవ్ర హెచ్చుతగ్గులను తగ్గించడానికి అలాగే నమ్మకమైన ఇంధన సరఫరాకు సిన్‌గ్యాస్‌ భరోసాగా నిలుస్తోంది. జామ్‌నగర్‌ రిఫైనరీలో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు