అమ్మకాల్లో అదరగొట్టిన రెనో.. ఏకంగా 9 లక్షల యూనిట్లు

1 Jun, 2023 07:11 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న ఫ్రెంచ్‌ కంపెనీ రెనో.. భారత మార్కెట్లో 9 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును చేరుకుంది. 11 ఏళ్లలో ఈ ఘనతను సాధించామని కంపెనీ తెలిపింది. మేడ్‌ ఇన్‌ ఇండియా వాహనాల విక్రయాలను రెనో ఇండియా 2012లో భారత్‌లో ప్రారంభించింది. 

(ఇదీ చదవండి: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! రేపటి నుంచి పెరగనున్న ధరలు)

ప్రస్తుతం ఎంట్రీ లెవెల్‌ క్విడ్, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కైగర్, మల్టీపర్పస్‌ వెహికిల్‌ ట్రైబర్‌ మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ‘టాప్‌–5 మార్కెట్లలో గ్రూప్‌ రెనో సంస్థకు భారత్‌ ఒకటి. భారత్‌ కోసం స్పష్టమైన దీర్ఘకాలిక వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకున్నాము. బలమైన ఉత్పత్తి, ప్రణాళికను రూపొందించాము. భవిష్యత్తు ఉత్పత్తుల శ్రేణిలో స్థానికీకరణకు అధిక ప్రాధాన్యతనిచ్చాం’ అని రెనో ఇండియా ఆపరేషన్స్‌ సీఈవో, ఎండీ వెంకట్రామ్‌ మామిళ్లపల్లి ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని వార్తలు