అమెరికా టెక్‌ దిగ్గజాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా..!

24 Dec, 2021 21:12 IST|Sakshi

రష్యాలో అమెరికా టెక్‌ దిగ్గజాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రముఖ దిగ్గజ టెక్‌ సంస్థ గూగుల్‌కు రష్యాలో మరోసారి షాక్‌ తగిలింది. నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు మాస్కో కోర్టు గూగుల్‌కు సుమారు రూ 735 కోట్ల జరిమానా విధించింది. ఇటీవలి కాలంలో రష్యా విదేశీ టెక్ కంపెనీలపై నిషేధించిన కంటెంట్‌ను తొలగించనందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంది. రష్యాలో నిషేధిత కంటెంట్‌లో భాగంగా అశ్లీల అంశాలు, తీవ్రవాది భావజాల పోస్ట్‌లు, డ్రగ్స్‌కు సంబంధించిన కంటెంట్‌ నిషేధిత జాబితాలో ఉన్నాయి.

గత కొంతకాలంగా విదేశీ టెక్‌ కంపెనీలకు రష్యా ప్రభుత్వం భారీగా జరిమానాలను విధిస్తూనే ఉంది. యూఎస్ ఆధారిత టెక్ కంపెనీలపై రష్యా ప్రభుత్వం నియంత్రణలను మరింత కఠినతరం చేస్తోంది. ఇది వ్యక్తిగత, కార్పొరేట్ స్వేచ్ఛను హరిస్తున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల విదేశీ టెక్ కంపెనీలపై, ప్రత్యేకించి సోషల్ నెట్‌వర్క్‌లపై రష్యా మరింత ఒత్తిడి పెంచింది. నిన్ననే ట్విటర్ మీద భారీ జరిమానా విధించిన రష్యా, నేడు(డిసెంబర్ 24) గూగుల్‌ మీద జరిమానా విధించింది. ఈ ఏడాది కంటెంట్ ఉల్లంఘనల వల్ల 32.5 మిలియన్ రూబిళ్లు (సుమారు రూ. 3.2 కోట్లు) జరిమానాను చెల్లించిన గూగుల్, అనేక సమస్యలపై మాస్కో కోర్టుతో విభేదిస్తోంది. గూగుల్, మెటా ప్లాట్ ఫారమ్‌లతో సహా ఇతర యుఎస్ టెక్నాలజీ కంపెనీల మీద రష్యా తీవ్ర ఒత్తడి చేస్తుంది.

(చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..!)

>
మరిన్ని వార్తలు