గెలాక్సీ ఎస్ 21 లాంచ్ డేట్ వచ్చేసింది!

4 Jan, 2021 15:47 IST|Sakshi

గతంలో మనం చెప్పుకున్నట్లే గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ను జనవరి 14న తీసుకొస్తున్నట్లు శామ్‌సంగ్ అధికారికంగా ప్రకటించింది. కంపెనీ కొత్త గెలాక్సీ ఆన్ ప్యాక్డ్ 2021 ఈవెంట్‌ పేరుతో విడుదల తేదీని ప్రకటించింది. “వెల్‌కమ్ టు ది ఎవ్రీడే ఎపిక్” పేరుతో ప్రసారమయ్యే వర్చువల్ ఈవెంట్ లో ఇండియా కాలమాన ప్రకారం జనవరి 14 రాత్రి 8 గంటలకు గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ను విడుదల చేయనుంది. తాజా గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్, గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా ఉన్నాయి.(చదవండి: ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లో హలచల్ చేస్తున్న గెలాక్సీ ఎస్ 21 ఫీచర్స్)

ఇప్పటికే గెలాక్సీ ఎస్ 21 ఫోన్ల ఫీచర్స్ కి సంబందించిన కొన్ని లీక్స్ బయటకి వచ్చాయి. ఈ లీక్స్ ప్రకారం, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 6.2-అంగుళాల డైనమిక్ అమోలేడ్ 2 ఎక్స్ డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ మోడల్ 6.7-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. రెండు మోడళ్లలో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్ డి ప్లస్ ప్యానెల్లు ఉంటాయి. ఈ మొబైల్ స్క్రీన్లు హెచ్ డిఆర్ 10 ప్లస్ కి సపోర్ట్ చేస్తాయి. ఈ మొబైల్స్ లో తాజా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, అండర్ స్క్రీన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను తీసుకురావచ్చు. ఈ ఫోన్‌లలో శామ్‌సంగ్ కొత్త ఎక్సినోస్ ప్రాసెసర్‌తో పాటు 8జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఫోన్‌లలో మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఉందా లేదా అనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు.

మరిన్ని వార్తలు