ఎయిర్‌ఫోర్స్‌తో ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీవోబీ ఒప్పందాలు

8 Jul, 2022 05:25 IST|Sakshi

ముంబై: ప్రభుత్వరంగ ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీవోబీ భారత వాయుసేన (ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌తో ‘డిఫెన్స్‌ వేతన ప్యాకేజీ’ ఒప్పందం చేసుకున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం కింద ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగులు, పదవీ విరమణ తీసుకున్న వారికి ఎస్‌బీఐ పలు ప్రయోజనాలు, ఫీచర్లతో ఉత్పత్తులను ఆఫర్‌ చేయనుంది.

వ్యక్తిగత ప్రమాద బీమా, వాయు ప్రమాదం, విధుల్లో మరణిస్తే అదనపు పరిహారంతో బీమా రక్షణను అందించనున్నట్టు తెలిపింది. శాశ్వత/పాక్షిక అంగవైకల్య కవరేజీ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ‘‘మన జాతి, పౌరుల రక్షణ కోసం వైమానిక దళ ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్నాం. డిఫెన్స్‌ శాలరీ స్కీమ్‌ కింద వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారాలు అందించడాన్ని కొనసాగిస్తాం’’అని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖరా ప్రకటించారు. ఈ ప్రయోజనాలు డిఫెన్స్‌ శాలరీ ప్యాకేజీ పరిధిలో ఉన్న ఖాతాదారులకు ఆటోమేటిగ్గా లభిస్తాయని ఎస్‌బీఐ తెలిపింది.

మరిన్ని వార్తలు