SEBI Saa₹thi App: ఇన్వెస్టర్లకు అండగా సెబీ ‘సారథి’ యాప్‌..!

20 Jan, 2022 07:48 IST|Sakshi

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ‘సారథి’ (Saa₹thi) పేరుతో మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది. తద్వారా క్యాపిటల్‌ మార్కెట్లపట్ల ఇన్వెస్టర్లకు అవగాహన పెంచేందుకు సులభరీతిలో తెరతీసింది. సెక్యూరిటీ మార్కెట్ల ప్రాథమిక అంశాలు, తదితరాలలో ఇన్వెస్టర్లకు మరింత అవగాహన కల్పించడంతోపాటు.. విజ్ఞానాన్ని అందించనున్నట్లు సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి ఈ యాప్‌ విడుదల సందర్భంగా పేర్కొన్నారు. 

ఇటీవల స్టాక్‌ మార్కెట్లలో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా పెరగడంతోపాటు, పెట్టుబడులు సైతం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యాప్‌ విడుదలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల మొబైల్‌ ఫోన్ల ద్వారా అత్యధిక శాతం ట్రేడింగ్‌ జరుగుతుండటంతో యాప్‌ రూపకల్పనకు  తెరతీసినట్లు త్యాగి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు