StockMarketUpdate: ఆటో, ఐటీ షాక్‌: బుల్‌ రన్‌కు బ్రేక్

2 Dec, 2022 15:48 IST|Sakshi

63 వేల దిగువకు సెన్సెక్స్‌

18700 మార్క్‌ను కోల్పోయిన నిఫ్టీ 

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఎనిమిది రోజుల లాభాల పరుగుకు బ్రేక్‌ చెప్పాయి.  ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు సెన్సెక్స్‌, నిఫ్టీ వరుస రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ మార్కెట్లను ప్రభావితం చేసింది.  డే హై నుంచి  600 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్‌ 63 వేల దిగువకు  చేరింది. అలాగే నిఫ్టీ కూడా  18700 దిగువకు చేరింది.  ఆటో, ఐటీ షేర్లు  భారీగా నష్ట పోయాయి. చివరికి  సెన్సెక్స్‌ 416 పాయింట్లు కుప్పకూలి 62868 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లు నష్టంతో 18696  వద్ద ముగిసింది. 

అపోలో హాస్పిట్సల్‌, టెక్‌ మహీంద్ర, గ్రాసిం, బ్రిటానియా   డా. రెడ్డీస్‌ టాప్‌ విన్నర్స్‌గా నిలవగా,  ఐషర్‌ మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, టాటా కన్జూమర్స్స్‌ హెచ్‌యూఎల్‌​, హీరో మోటో నష్టపోయాయి.  అటు డాలరుమారకంలో  రూపాయ 12 పైసల నష్టంతో 81.31 వద్ద ఉంది. 

>
మరిన్ని వార్తలు