స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

23 Feb, 2021 19:08 IST|Sakshi

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిసాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి బయటపడ్డ మార్కెట్ అమ్మకాల ఒత్తిడి గురైంది. కీలక రంగాల మద్దతు లభించడంతో కొంత సానుకూలంగా కదలాడాయి. 49,745 వద్ద స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ కాసేపు లాభాల్లో పయనించింది. తర్వాత ఇంట్రాడేలో సెన్సెక్స్ 50,317 గరిష్ఠానికి చేరుకుంటే నిఫ్టీ 14,849 గరిష్టాన్ని చేరుకుంది. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఓ దశలో సెన్సెక్స్‌ 49,666 వద్ద, నిప్టీ 14,655 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకాయి. చివరకు సెన్సెక్స్‌ 7 పాయింట్ల లాభంతో 49,751.32కు చేరుకుంటే, నిఫ్టీ 32 పాయింట్లు లాభంతో 14,707.70 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. మొత్తంగా ఈరోజు సూచీలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.46 వద్ద నిలిచింది.

చదవండి:

ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..!

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో బయటపడ్డ మరో భారీ మోసం

మరిన్ని వార్తలు