సెన్సెక్స్‌ జంప్‌, స్పైస్‌జెట్‌కు భారీ షాక్‌

6 Jul, 2022 15:35 IST|Sakshi

సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. మెటల్‌, ఎనర్జీ రంగాలు తప్ప అన్ని రంగాల షేర్లు లాభ పడ్డాయి. ఆటో, ఫైనాన్స్‌ ఎఫ్‌ఎంసీజీ, ఫెర్టిలైజర్ల షేర్లు బాగా పుంజు కున్నాయి. ఫలితంగా  సెన్సెక్స్‌ 616 పాయింట్లు ఎగిసి  53750 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 15989 వద్ద ముగిసాయి.  బ్రిటానియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌యూఎల్‌ టాప్‌ గెయనర్స్‌గా, ఓఎన్‌జీసీ, హిందాల్కో, ఎన్టీపీసీ, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.

అటు ఇటీవల వరుస సాంకేతిక లోపాల ఘటనల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేర్లు బుధవారం కూడా పతనమైనాయి.  7 శాతం క్షీణించి ఒక సంవత్సరం కనిష్ట స్థాయికి చేరాయి. గత 18 రోజుల్లో స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం వరుసగా ఇది ఎనిమిదో ఘటన.దీంతో వీటిపై వివరణ ఇవ్వాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థకు నోటీసులిచ్చిన సంగతి  తెలిసిందే.  మరోవైపు  ఈక్విటీ మార్కెట్ల అండతో దేశీయ కరెన్సీ రూపాయి  ఆల్‌ టైం కనిష్టం నుంచి కోలుకుంది.  13 పైసలు ఎగిసి 79.27 వద్ద  ఉంది. 
 

>
మరిన్ని వార్తలు