స్టాక్‌మార్కెట్‌కు టీకా జోష్‌

27 Apr, 2021 11:24 IST|Sakshi

అంతర్జాతీయ సంకేతాలు, టాకీ జోష్‌

రెండో రోజు లాభాల్లో

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారంలో వరుసగా రెండోరోజు కూడా లాభాలతో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసి ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 335 పాయింట్లు ఎగిసి 48722 వద్ద,నిఫ్టీ  102 పాయింట్ల లాభం స్టాక్‌మార్కెట్‌కు టీకా జోష్తో‌ 14587 వద్ద జోష్‌గా ఉన్నాయి. దీంతో సెన్సెక్స్‌ 48500 స్థాయిని సునాయాసంగా దాటేయగా, నిఫ్టీ 14600కు సమీపంలో ఉంది. 

దేశీయంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకోవడం, ముఖ్యంగా 18 ఏళ్లుపైబడిని వారికి టీకాల కార్యక్రమం తొందర్లో షురూకానున్న నేపథ్యంలో ట్రేడర్లు సెంటిమెంట్‌  బావుందని భావిస్తున్నారు. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభ్లాలో ట్రేడ్‌ వుతున్నాయి.ముఖ్యంగా  బ్యాకింగ్‌, మెటల్ స్టాక్స్, ఐటీ ప్యాక్‌లో కొనుగోళ్ల సందడి రెండో రోజు కూడా కొనసాగుతోంది.  హిందాల్కో, టాటా స్టీల్, రిలయన్స్, జెఎస్ డబ్ల్యూ స్టీల్,  హీరో మోటోకార్ప్ , భారతి ఎయిర్‌ టెల్‌,దివీస్‌ , ఐటీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి.  మరోవైపు యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి, టెక్ మహీంద్రా, బిపిసిఎల్, నెస్లే ఇండియా  నష్టపోతున్నాయి. 

చదవండి : వరుడికి పాజిటివ్‌: అధికారుల బంపర్ ఆఫర్‌ తెలిస్తే..

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు