స్పైస్‌జెట్‌కు పెరిగిన నష్టాలు 

14 Aug, 2021 00:53 IST|Sakshi

క్యూ1లో రూ. 729 కోట్లు 

న్యూఢిల్లీ: బడ్జెట్‌ ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర నష్టం పెరిగి రూ. 729 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 593 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 705 కోట్ల నుంచి రూ. 1,266 కోట్లకు జంప్‌చేసింది. అయితే నిర్వహణ వ్యయాలు సైతం రూ. 1,298 కోట్ల నుంచి రూ. 1,995 కోట్లకు ఎగశాయి. కోవిడ్‌–19 ప్రభావం నేపథ్యంలో గత ఐదు క్వార్టర్లుగా పలు సవాళ్లమధ్య కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు స్పైస్‌జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు