దేశీ సూచీల జోరు .. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

30 Aug, 2021 09:53 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికపు  జీడీపీ గణాంకాలను కేంద్రం మంగళవారం విడుదల చేయనుంది. లో బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా క్యూ1లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని అర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆటో సేల్స్‌ కూడా ఊపందుకుంటున్నాయి. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగుతోంది.

రికార్డుల జోరు
ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఆసక్తి చూపిస్తుండటంతో ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 56,329 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు పొందుతూ సరికొత్త ఎత్తులకు చేరుకుంది. ఉదయం 10 గంటలకు 439 పాయింట్లు లాభపడి 56,564 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ సైతం జోరుమీదుంది. 123 పాయింట్లు లాభపడి 16,829 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత వారం 16,700 పాయింట్ల దగ్గర ఒడిదుడుకులు ఎదుర్కొన్న నిఫ్టీ ఈ సెషన్‌ ఆరంభంలోనే సునాయసంగా 16,800 పాయింట్లను క్రాస్‌ చేసింది.

లాభాల బాట
టైటాన్‌, టాటా స్టీల్‌, మారుతి సుజూకి, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పేయింట్స్‌, ఎన్టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫిన్‌ సెర్వ్‌, భారతి ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాలను పొందాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి.
 

చదవండి: స్టాక్‌ మార్కెట్‌లో రికార్డుల ర్యాలీ.. ఈ అంశాలే కీలకం

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు