సాక్షి మనీ మంత్ర: బుల్‌ పరుగు.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్లు

14 Dec, 2023 16:18 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం సరికొత్త గరిష్టాలకు ఎగబాకాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 797 పాయింట్లు పెరిగి గరిష్ఠస్థాయి 70,381.24కి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ 222 పాయింట్లు ఎగబాకి 21,148.45 రికార్డు స్థాయికి వెళ్లింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.81% పెరిగింది. స్మాల్ క్యాప్ షేర్లు 1.11% లాభపడటంతో మార్కెట్ ఊపందుకుంది. 

ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం కీలక వడ్డీ రేటును వరుసగా మూడోసారి స్థిరంగా ఉంచింది. ఫెడ్ నిర్ణయంతో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ రికార్డు స్థాయిలో 512.30 పాయింట్లు లేదా 1.40% జోడించి 37,090.24 వద్ద ముగిసింది.

ఆటో, రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, ఎనర్జీ స్టాక్‌ల్లో చివరి గంట కొనుగోళ్లు కనిపించాయి. అక్టోబర్‌లో విద్యుత్ ఉత్పత్తి 20.4% పెరిగిన తర్వాత పవర్ స్టాక్‌లు పుంజుకుంటున్నాయి. అక్టోబరు నెలలో మైనింగ్ అవుట్‌పుట్ వృద్ధి 13.1% నమోదైంది. దాంతో మైనింగ్ స్టాక్‌లలో ర్యాలీ కనిపించింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. పవర్‌గ్రిడ్‌, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ షేర్లు నష్టాల్లో డ్రేడయ్యాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

>
మరిన్ని వార్తలు