Stock Market: లాభాలతో ముగిసిన సూచీలు

21 May, 2021 17:06 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం కళ నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో నేడు భారీ లాభాలతో దేశీ సూచీలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 49834.00, నిఫ్టీ 150001.50 వద్ద ఉన్నాయి. గత పద్దెమినిది రోజులుగా ఇంధన ధరల్లో నిర్దిష్టమైన పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. బీపీసీఎల్‌, ఐఓసీ, ఇండస్‌ ఇండ్‌బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.02 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

కాగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ రెండో రోజులుగా నష్టపోతున్న సంగతి తెలిసిందే. దేశీయ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ అంశం సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో.. గురువారం సెన్సెక్స్‌ 338 పాయింట్లు పతనమైన 49,565 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 15వేల దిగువన 14,906 వద్ద ముగిసింది. అయితే నేడు లాభాలతో సూచీలు ప్రారంభం కావడం ఊరటనిచ్చే అంశం.

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

  • స్టాక్‌ మార్కెట్‌ సూచీలో లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్‌ 1.97శాతం(975.62 పాయింట్లు) ఎగిసి 50540.50 వద్ద, నిఫ్టీ 1.81 శాతం ఎగిసి(269 పాయింట్లు) 15,175.30 వద్ద ముగిసింది. 
  • ఎస్బీఐ, హెడ్‌ఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌, ఐసీసీఐ, యాక్సిస్‌ బ్యాంకు లాభాలు చవిచూడగా... పవర్‌గ్రిడ్‌, ఐఓసీ, డీర్‌ఎల్‌, గ్రాసిం తదితర కంపెనీల షేర్లు నష్టాల బాటపట్టాయి.

మరిన్ని వార్తలు