మరో ఘనత సాధించిన టీసీఎస్

11 Jul, 2021 18:02 IST|Sakshi

దేశంలోని ఐటీ దిగ్గజలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రికార్డు స్థాయిలో 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్న కంపెనీగా అవతరించింది. దీంతో దేశంలో ఈ ఘనత సాధించిన తొలి ఐటీ సంస్థగా టీసీఎస్ నిలిచింది. జూన్ 30 నాటికి టీసీఎస్ మొత్తం శ్రామిక శక్తి 5,09,058కు పెరిగింది. 2021-22 మొదటి మూడు నెలల్లో 20,409 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్న తర్వాత టీసీఎస్ ఐదు లక్షల శ్రామిక శక్తి మైలురాయిని చేరుకుంది. టీసీఎస్ సీఈఓ మాట్లాడుతూ.. " ఇంకా కొత్త నియామకాల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. టీసీఎస్ శ్రామిక శక్తిలో 36.2 శాతం ఉన్న మహిళలు ఉన్నారు" అని అన్నారు.

మొదటి త్రైమాసికంలో కనీసం 4,78,000 మంది ఉద్యోగులకు ఎజిల్ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వబడింది. అలాగే, 4,07,000 మందికి పైగా కార్మికులకు బహుళ కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. గత 12 నెలల్లో తన ఐటీ సర్వీసెస్ అట్రిషన్ రేటు 8.6 శాతం వద్ద ఉందని, ఇది పారిశ్రామికాంగ అత్యల్పం అని టీసీఎస్ తెలిపింది. 2022 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసిక లాభం 29 శాతం పెరగినట్లు కంపెనీ ప్రకటించింది. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో డిజిటల్ సేవలకు వ్యాపారాల నుంచి అధిక డిమాండ్ రావడం వల్ల లాభాలు వచ్చాయి అని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.7,008 కోట్ల నుంచి రూ.9,008 కోట్లకు పెరిగింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు