ముకేష్‌ అంబానీ 2021 సక్సెస్‌: ఈ ఐదు బుక్స్‌.. ఆసియా కుబేరుడికి ఆసరా

20 Dec, 2021 14:26 IST|Sakshi

Mukesh Ambani.. Most Helped Five Books In 2021:  ఒక  చిన్నటేబుల్‌, ఒక కుర్చీ సెటప్‌తో చిన్న స్టార్టప్‌గా మొదలైంది రిలయన్స్‌. మైక్రో-ఎంటర్‌ప్రైజ్‌గా ఎదిగి.. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు ప్రపంచంలోనే లార్జెస్ట్‌ ఎంటర్‌ప్రైజ్‌లలో ఒకటిగా పేరు దక్కించుకుంది. గ్లోబల్‌ ట్రేడ్‌లో ఏదో ఒక మైలు రాయిని అధిగమించినప్పుడల్లా తన తండ్రి ధీరుభాయ్ అంబానీ పడ్డ కష్టమే తనకు స్ఫూర్తి అంటూ రిలయన్స్‌ చైర్మన్‌ ముకేష్‌ అంబానీ చెప్తుండడం చూస్తున్నాం. 


అయితే కరోనా కాలంలో తనలో కొత్త ఉత్సహాన్ని నింపింది తద్వారా రిలయన్స్‌ ఎదుగుదలకు సాయం చేసింది కొందరి రచనలే అని ఆయన అంటున్నాడాయన. బాంబేలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్‌ డిగ్రీ చేసిన ముకేష్‌.. వ్యాపార దిగ్గజాలు, మేధావులు రాసే పుస్తకాలను క్రమం తప్పకుండా చదువుతుంటారు. అంతేకాదు వాటి రివ్యూలను సైతం ఇస్తూ.. వర్తమాన వ్యాపారులకు చదవమని సూచిస్తుంటారు కూడా. 2021 బిజినెస్‌ ఇయర్‌ని అర్థం చేసుకోవడానికి..  2022కి సన్నద్ధం కావడానికి ముకేష్‌ అంబానీకి ఐదు పుస్తకాలు సాయపడ్డాయట. అవేంటో చూద్దాం ఇప్పుడు.. 


టెన్‌ లెస్సన్స్‌ ఫర్‌ ఏ పోస్ట్‌-ప్యాండెమిక్‌ వరల్డ్‌

ఇండో-అమెరికన్‌ జర్నలిస్ట్‌ ఫరీద్‌ జకారియా రాసిన పుస్తకం ఇది. కోవిడ్-19 మహమ్మారి,  ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని అత్యంత వినాశకరమైన సంఘటనల మధ్య కొన్ని స్పష్టమైన సారూప్యతలను సంగ్రహించి ఫరీద్  ఈ పుస్తకం రాశారు.  ప్రపంచ సంక్షోభాలనేవి తరచుగా నిలకడలేని జీవనశైలి పద్ధతులు..  బలహీనమైన పాలనా నిర్మాణాల నుండి ఉద్భవించాయని చెప్తుంది ఈ పుస్తకం.  ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని,   సమర్థవంతమైన నాయకత్వం, జీవనశైలి మార్పు,  సమర్థవంతమైన అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుందని ఈ పుస్తకం చెబుతుంది. ‘‘వ్యాప్తి అనివార్యం, కానీ మహమ్మారి ఐచ్ఛికం’’ పుస్తకంలో ముకేష్‌కి బాగా నచ్చిన కొటేషన్‌ అంట!.
 


ప్రిన్సిపుల్స్‌ ఫర్‌ డీలింగ్‌ విత్‌ ది ఛేంజింగ్‌ వరల్డ్‌ ఆర్డర్‌: వై నేషన్స్‌ సక్సీడ్‌ అండ్‌ ఫెయిల్‌

అమెరికన్‌ బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ రే దాలియో రాసిన పుస్తకం ఇది. ప్రధాన దేశాలకు సంబంధించిన చరిత్రలో ఐదు వందల ఏళ్ల విజయాలను, వైఫల్యాలను స్థిరంగా పరిశీలించి.. అన్ని కోణాల్లోనూ అంశాలను స్పృశించిన ఆసక్తికరమైన పుస్తకం. ప్రస్తుతం, రాబోయే కాలాల మార్పుల మీద సమగ్రంగా చర్చ జరిపిన పుస్తకం ఇది.  పాలసీ మేకర్లు, వ్యవస్థాపకులు(ఎంట్రప్రెన్యూర్లు), కార్యనిర్వాహకులు(ఎగ్జిక్యూటివ్స్‌) మరీముఖ్యంగా యువత తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. 


ది రాగింగ్‌ 2020s: కంపెనీస్‌, కంట్రీస్‌, పీపుల్‌ అండ్‌ ది ఫైట్‌ ఫర్‌ అవర్‌ ఫ్యూఛర్‌

అమెరికన్‌ ఆథర్‌ అలెక్‌ రాస్‌ రాసిన పుస్తకం ఇది. ఆధునిక నాగరికతలో అనేక దశాబ్దాలు కొనసాగిన సామాజిక ఒప్పందం, ప్రభుత్వాలు, వ్యాపారాలు,  ప్రజల మధ్య అనధికార ఒప్పందాలనేవి..  డిజిటల్ యుగపు ప్రాథమిక మార్పునకు ఎలా లోనయ్యాయో ఇది లోతుగా పరిశోధించింది. ఈ మార్పునకు దోహదపడ్డ రాజకీయ- ఆర్థిక శక్తులపై,  నాగరికతకు ముందున్న విషయాలపై ఈ కాలపు మేధావుల అభిప్రాయాలతో ఇంటర్వ్యూలు ఉన్నాయి ఈ పుస్తకంలో.
 


2030: హౌ టుడేస్‌ బిగ్గెస్ట్‌ ట్రెండ్స్‌ విల్‌ కొలిడే అండ్‌ రీషేప్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌

స్పానిష్‌ సోషియాలజిస్ట్‌ మౌరో గుయిల్లెన్‌ రాసిన పుస్తకం ఇది. ఇది మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ బుక్‌.  2030లో ప్రపంచ స్థితి గురించి, ముఖ్యంగా జనాభాలో సంభావ్య మార్పులు, దీని ప్రభావం  ప్రపంచ ఆర్థిక అవకాశాలపై ఎలా ఉంటుంది అనే విషయాలతో నిండి ఉంటుంది.  కోవిడ్ అనంతర ప్రపంచాన్ని రూపొందించడానికి కట్టుబడి ఉన్న పట్టణీకరణ, సాంకేతికత, గిగ్ ఎకానమీ, ఆటోమేషన్‌లోని పోకడలను కూడా అన్వేషించింది. 

బిగ్‌ లిటిల్‌ బ్రేక్‌త్రోస్‌: హౌ స్మాల్‌, ఎవ్రీడే ఇన్నొవేషన్స్‌ డ్రైవ్‌ ఓవర్‌సైజ్డ్‌ రిజల్ట్స్‌

అమెరికన్‌ ఎంట్రెప్రెన్యూర్‌ జోష్‌ లింక్నర్‌ రాసిన బుక్‌ ఇది.  వ్యాపారవేత్తలంతా తప్పక చదవాల్సిన బుక్‌ ఇది.  వ్యాపారంలో భారీ లాభాలకు మూలకారణం.. సృజనాత్మకంగా చేపట్టే చిన్న చిన్న చర్యలు, నిర్ణయాలే అని ఈ బుక్‌ సారాంశం. రోజువారీ సూక్ష్మ-ఆవిష్కరణలను పెంపొందించడం ద్వారా, వ్యక్తులు మరియు సంస్థలు కఠినమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. తద్వారా కోవిడ్ అనంతర ప్రపంచంలో పరివర్తన అవకాశాలను స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు. 

చదవండి: క్రిప్టో కరెన్సీ బిల్లుపై ముఖేష్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు