Tinder User Creates A Contract: బాయ్‌ఫ్రెండ్‌గా కొనసాగాలంటే..బాండ్‌ మీద సంతకం చేయాల్సిందే..!

11 Sep, 2021 19:50 IST|Sakshi

టిండర్‌ ఈ యాప్‌ గురించి మనలో చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటా..! టిండర్‌ ఒక డేటింగ్‌ యాప్‌. ఈ యాప్‌తో తమకు నచ్చిన వ్యక్తులను పరిచయం చేసుకోని వారితో డేటింగ్‌ చేస్తూ వారి అభిరుచులను తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌తో కలుసుకున్న జంటలు కొన్ని పెళ్లి  వరకు కూడా పోయాయి. మరి కొంత మందికి సరైన జోడి వెతుకులాటలో మోసపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.  
చదవండి: Apple : మూఢనమ్మకాలను నమ్ముతున్న ఆపిల్‌..! ఎంతవరకు నిజం..?

తాజాగా అమెరికాకు చెందిన యానీ రైట్‌ అనే మహిళ టిండర్‌లో పరిచయమైన మైక్‌ హెడ్‌తో మొదటిసారి డేటింగ్‌ చేశాక తన బాయ్‌ఫ్రెండ్‌గా స్వీకరించడంకోసం  విచిత్రమైన ఐడియాతో ముందుకొచ్చింది. గతంలో తనకు జరిగిన పొరపాటును తిరిగి పునరావృతం కాకుండా ఉండడం కోసం పకడ్బందీగా ఒక బిజినెస్‌ డీల్‌ లాగా 17 పేజీల బాండ్‌పై సంతకం చేసి తనకు హమీ ఇవ్వాలని కాబోయే బాయ్‌ఫ్రెండ్‌కు తెలిపింది. బాండ్‌లో ఉన్న కట్టుబాట్లకు కచ్చితంగా నడుచుకుంటాననే హమీ ఇస్తేనే బాయ్‌ప్రెండ్‌గా స్వీకరించడానికి సిద్ధమని మైక్‌ హెడ్‌తో పేర్కొంది. 

తొలుత షాక్‌కు గురైన మైక్‌ హెడ్‌ 17 పేజీల బాండ్‌పై సంతకం చేసి యానీకి బాయ్ ఫ్రెండ్‌గా కొనసాగుతున్నాడు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరువురు నిజాయితీని, ఒకరికొకరికి కావాల్సిన అవసరాలను తీర్చడంలో, ఇరువురు మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్‌ ఉండాలని ఒప్పందంలో ఉన్నాయి.  కాగా ఈ జోడీ ఈ  బంధాన్ని బిజినెస్‌ డీల్‌గానే చూస్తామనడం కొసమెరుపు. 

 చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌..!

మరిన్ని వార్తలు