Delhi Weather Update: ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

25 Nov, 2023 07:08 IST|Sakshi

దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుసగా రెండో రోజు కనిష్ట ఉష్ణోగ్రత పది డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉండవచ్చు. 

ఈ సమయంలో ఉదయం తేలికపాటి పొగమంచు కూడా ఉండనుంది. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి, ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. 

రెండు రోజుల తర్వాత అంటే రాబోయే సోమవారం నాడు ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం ఢిల్లీలోని లోధి రోడ్‌లో శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 9.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 26.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శనివారం ఉదయం అంటే ఈరోజు వాతావరణంలో పొగమంచు వ్యాపించింది. పగటిపూట తేలికపాటి సూర్యరశ్మి ఉండనుంది.
ఇది కూడా చదవండి: రాజస్థాన్‌ ఎవరిదో!

మరిన్ని వార్తలు