భారత్‌లో లభించే టాప్ 5 బెస్ట్ సీఎన్​జీ కార్లు - ధర తక్కువ & ఎక్కువ మైలేజ్!

15 Apr, 2023 10:11 IST|Sakshi

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా.. ఎలక్ట్రిక్ & సీఎన్​జీ కార్లు విడుదలవుతున్నాయి. భారతీయ విఫణిలో సీఎన్​జీ కార్లకు డిమాండ్ భారీగానే ఉంది. ఈ తరుణంలో తక్కువ ధరలో సీఎన్​జీ కొనాలనుకునే వారు ఈ బెస్ట్ కార్లను ఎంపిక చేసుకోవచ్చు. 

మారుతి సుజుకి ఆల్టో 800 సీఎన్​జీ:
మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఆల్టో 800 మన జాబితాలో చెప్పుకోదగ్గ బెస్ట్ సీఎన్​జీ కారు. ఈ మోడల్ ధర రూ. 5.13 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 30 కి.మీ/కేజీ మైలేజ్ అని తెలుస్తోంది. మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే వాహనాల్లో మారుతీ సుజుకీ 800 సీఎన్​జీ ఉత్తమ మైలేజ్ అందిస్తుందని రుజువైంది.

మారుతి సుజుకి ఎస్​-ప్రెస్సో సీఎన్​జీ:
ఎస్​-ప్రెస్సో సీఎన్​జీ కూడా మారుతి సుజుకి కంపెనీకి చెందిన బెస్ట్ సీఎన్​జీ కారు. ఇది కేజీకి 32 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎల్​ఎక్స్​ఐ వేరియంట్​లో మాత్రమే సీఎన్​జీ ఆప్షన్ లభిస్తుంది. ఇందులో 1 లీటర్ పెట్రోల్​ ఇంజిన్​ 56 బీహెచ్​పీ పవర్​ 82 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్​జీ:
రూ. 5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కే10 కేజీకి 34 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తూ ఉత్తమ సీఎన్​జీ కారుగా నిలిచింది. ఇందులోని 1.0 లీటర్​ కే10 సిరీస్​ ఇంజిన్ 56 బీహెచ్​పీ పవర్​ 82 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మారుతి సుజుకి వాగన్​ఆర్​ సీఎన్​జీ:
వాగన్​ఆర్​ సీఎన్​జీ ఉత్తమ మైలేజ్ అందించే మారుతి కంపెనీ బ్రాండ్. దీని ధర రూ. 6.43 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఒక కేజీ సీఎన్​జీతో 34.05 కి.మీల మైలేజ్​ అందిస్తుంది. ఇందులోని 1.0 లీటర్​ కే సిరీస్​ ఇంజిన్ 56 బీహెచ్​పీ పవర్​, 82 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా టియాగో ఐసీఎన్​జీ:
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఉత్తమ CNG కార్లను అందిస్తోంది. ఈ విభాగంలో ఒకటైన టియాగో ఐసీఎన్​జీ కేజీకి 26.49 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 6.44లక్షలు. టియాగో ఐసీఎన్​జీలోని 1.2 లీటర్​ ఇంజిన్​ 72 బీహెచ్​పీ పవర్​, 95 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది.

ఇటీవలే భారతదేశంలో సీఎన్​జీ ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో సీఎన్​జీ కారు కొనాలనుకునే వారికి పైన చెప్పిన కార్లు మంచి ఎంపిక అవుతాయని భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను, సందేహాలను మాతో పంచుకోండి.

మరిన్ని వార్తలు