Union Bank of India: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు భారీ షాక్‌!

12 Sep, 2022 15:17 IST|Sakshi

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులకు భారీ షాక్‌ తగిలింది. ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేట్‌(ఎంసీఎల్‌ఆర్‌)లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఖాతాదారులకు అందించే వివిధ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో కీలకమైన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట‍్లను పెంచినట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నోటిఫికేషన్‌లో  తెలిపింది. దీంతో పెరిగిన ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు పలు రకాల లోన్లపై ప్రభావం పడనుంది.    

సెప్టెంబర్ 11 నుండి పెరిగిన కొత్త యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంసీఎల్ఆర్ రేట్లు అమల్లోకి వస్తాయని ఆ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

ఇక ఈ ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు ఓవర్‌ నైట్‌ టెన్ష్యూర్‌కు 7.00 శాతం, ఒక నెల టెన్ష్యూర్‌ కాలానికి 7.15  శాతానికి పెంచారు. తద్వారా అన్ని టెన్ష్యూర్‌ కాలానికి 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. మూడు నెలల కాలానికి ఎంసీఎల్ఆర్ రేట్లను 7.25 శాతంగా యథాతథంగా ఉంచారు. ఆరు నెలలు, ఏడాది కాలపరిమితిలో యూబీఐ బ్యాంక్ రేట్లు వరుసగా 7.55 శాతం, 7.75 శాతం చొప్పున 5 బేసిస్ పాయింట్లు పెరిగాయి.

రెండేళ్లు, మూడేళ్ల కాలపరిమితిలో యూబీఐ ఎంసీఎల్ఆర్ రేట్లు 7.95 శాతం, 8.10 శాతం చొప్పున 20 బేసిస్ పాయింట్లు, 35 బేసిస్ పాయింట్లు పెరిగాయి.  

కొత్త యూనియన్ బ్యాంక్ ఎంసిఎల్ఆర్ రేట్లు సెప్టెంబర్ 11 నుండి అమల్లోకి రాగా..ఈ రేట్ల పెంపు కొత్తగా రుణాలు తీసుకునే ఖాతాదారులకు లేదంటే, ఇప్పటికే రుణాలు తీసుకున్న రుణ గ్రహితలపై ప్రభావం పడునుంది. బ్యాంక్‌ నుండి తీసుకున్న రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి.  

సెప్టెంబర్ 11, 2022 నుండి అమల్లోకి వచ్చిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ రేట్లు ఇలా ఉన్నాయి. 

ఓవర్ నైట్: ఎంసీఎల్‌ఆర్‌ పాత రేట్లు - 6.95 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు - 7.00 శాతానికి పెరిగాయి

ఒక నెల: ఎంసీఎల్‌ఆర్‌ పాత రేట్లు - 7.10 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు - 7.15 శాతానికి పెరిగాయి

మూడు నెలలు: ఎంసీఎల్‌ఆర్‌ పాత రేట్లు 7.35 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు - 7.35 శాతంగా ఉంది 

ఆరు నెలలు: ఎంసీఎల్‌ఆర్‌ పాత రేట్లు 7.50 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు - 7.55 శాతానికి పెరిగాయి

ఒక సంవత్సరం: ఎంసీఎల్‌ఆర్‌ పాత రేట్లు 7.70 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు - 7.75 శాతానికి పెరిగాయి

రెండేళ్లు :  ఎంసీఎల్‌ ఆర్‌ పాత రేట్లు 7.75 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు 7.95 శాతానికి పెరిగాయి. 

మూడేళ్లు:  ఎంసీఎల్‌ ఆర్‌ పాత రేట్లు  7.75 శాతం ఉండగా కొత్త ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు 8.10 శాతానికి పెరిగాయి.

చదవండి: పేదల నడ్డి విరుస్తున్న అడ్డగోలు వడ్డీ వసూళ్లు, ఆర్బీఐ కీలక నిర్ణయం!

మరిన్ని వార్తలు