క్లౌడ్‌కు ఏఐ మద్దతు: క్యాప్‌జెమిని

18 Nov, 2023 01:28 IST|Sakshi

2020తో పోలిస్తే పెరిగిన క్లౌడ్‌ వినియోగం

రెండేళ్లలో క్లౌడ్‌ సరీ్వసుల్లో పూర్తిస్థాయి ఏఐ

న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో ప్రతీ మూడు ఫైనాన్షియల్‌ సరీ్వసుల సంస్థలలో రెండు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)కు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని పేర్కొంది. తద్వారా పూర్తి వేల్యూ చైన్‌లో ఏఐ వినియోగం జోరందుకోనున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. క్లౌడ్‌ను భారీస్థాయిలో అమలు చేస్తేనే ఏఐ పెట్టుబడుల ఫలితం లభిస్తుందని తెలియజేసింది. అయితే ఫైనాన్షియల్‌ సరీ్వసుల కంపెనీలు క్లౌడ్‌ను పరిమిత స్థాయిలోనే వినియోగిస్తుండటంతో ఏఐ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటున్నట్లు వివరించింది.

నిజానికి బ్యాంకులు, బీమా సంస్థలలో సగంవరకూ కీలకమైన బిజినెస్‌ అప్లికేషన్లను క్లౌడ్‌లోకి మార్పు చేసుకోనేలేదని వెల్లడించింది. అయితే కొద్ది నెలలుగా బ్యాంకులు, బీమా సంస్థలలో 91 శాతం క్లౌడ్‌ సర్వీసుల వినియోగంలోకి ప్రవేశించాయని పేర్కొంది. 2020లో నమోదైన 37 శాతంతో పోలిస్తే ఇది భారీ పురోగతి అంటూ నివేదిక ప్రస్తావించింది. అయితే అధిక శాతం కంపెనీలు క్లౌడ్‌లోకి ప్రవేశించినప్పటికీ.. సర్వే ప్రకారం 50 శాతం సంస్థలు కీలక బిజినెస్‌ అప్లికేషన్లకు నామమాత్రంగానే క్లౌడ్‌ సేవలు పొందుతున్నట్లు క్యాప్‌జెమిని నివేదిక వెల్లడించింది.

ఏఐకు భారీ డిమాండ్‌
కీలక సరీ్వసులలో ఏఐ, జెన్‌ ఏఐ విలువ ప్రతిబింబించాలంటే క్లౌడ్‌ను భారీ స్థాయిలో అమలు చేయవలసి ఉంటుందని క్యాప్‌జెమిని ఎగ్జిక్యూటివ్‌ అనుజ్‌ అగర్వాల్‌ తెలియజేశారు. వెరసి బ్యాంకులు క్లౌడ్‌కు ప్రాధాన్యత ఇస్తే ఫిన్‌టెక్‌ సరీ్వసుల్లో వృద్ధికి ఇది సహకరిస్తుందని వివరించారు. ప్రస్తుతం ఫిన్‌టెక్‌లు కొన్ని ప్రత్యేక విభాగాలలో ఏఐను వినియోగించడం ద్వారా బ్యాంకులకు భారీ విలువను చేకూర్చుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు ఆటోమేషన్, వ్యక్తిగత కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్, ఆర్థిక నేరాల కట్టడి, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. ప్రపంచంలోనే దేశీయంగా ఏఐ నైపుణ్యం అత్యధిక స్థాయిలో విస్తరించి ఉన్నట్లు తెలియజేశారు. ఏఐలో భారీ పెట్టుబడులు నమోదుకావడంతోపాటు.. ఏఐ సొల్యూషన్లకు డిమాండ్‌ పెరుగుతున్నట్లు తెలియజేశారు. డిజిటల్‌ ఇండియాకు ప్రభుత్వ మద్దతు, విస్తృత డేటా అందుబాటు తదితరాలు దేశంలో ఫిన్‌టెక్‌ విప్లవానికి తోడ్పాటునిస్తున్నట్లు వివరించారు.  

మరిన్ని వార్తలు