వేదాంత డైరీస్‌ : న్యూయార్క్‌లో జేబుదొంగలు !

4 Apr, 2022 17:14 IST|Sakshi

జీరో నుంచి హీరో వరకు సాగిన తన జీవిత ప్రయాణంలో ముఖ్య ఘట్టాలన్ని క్రమం తప్పకుండా వివరిస్తున్నారు వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముక్క ఇంగ్లీష్‌ రాకుండా ముంబై రావడం.. అక్కడ అప్పు చేసి షంషేర్‌ కేబుల్‌ కంపెనీ కొనడం.. ఆ తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక తాను పడిన పాట్లను ఆయన వివరించారు. తాజాగా మరో కీలక ఘట్టానికి సంబంధించిన అంశాలు వెల్లడించారు. 

1986లో రూల్స్‌ మార్చేయడంతో ప్రభుత్వ రంగ సంస్థలు షంషేర్‌ నుంచి కేబుళ్లు కొనడానికి భారీ ఎత్తున ఆర్డర్లు ఇవ్వడం మొదలెట్టాయి. వస్తున్న ఆర్డర్లకు తయారీ సామర్థ్యానికి పొంతన లేకపోవడంతో షంషేర్‌ విస్తరణ అవసరమైంది అనిల్‌ అగర్వాల్‌కి. దీంతో సెకండ్‌ హ్యాండ్‌ మిషనరీ కొనాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం నాలుగు కోట్ల రూపాయల అప్పు కూడా చేశాడు.

అమెరికా టూర్‌
ఆరోజుల్లో అమెరికాని కొత్త అవకాశాలకు స్వర్గధామంగా చెప్పుకునే వారు. దీంతో తన కలలు సాకారం చేసుకునేందుకు అమెరికా వెళ్లాలని అనిల్‌ అగర్వాల్‌ డిసైడ్‌ అయ్యారు. అంతంత మాత్రంగా వచ్చిన టూటీ ఫ్రూటీ ఇంగ్లీష్‌ భాషా పరిజ్ఞానం, ఇంట్లో వాళ్లు తయారు చేసిన ఘర్‌ కా ఖానాతో నిండిన సూట్‌కేస్‌లతో పాటు అజయ్‌ ఆనంద్‌ అనే బీహారీ ఫ్రెండ్‌ను తోడుగా పెట్టుకుని న్యూయార్క్‌కి పయణమయ్యాడు అనిల్‌ అగర్వాల్‌

దొంగల భయం
న్యూయార్క్‌లో జేబుదొంగలు ఎక్కువగా ఉంటారని తెలిసిన వాళ్లు చెప్పడంతో తమ దగ్గరున్న ఐదు వందల డాలర్లను జాగ్రత్తగా జేబు దొంగల కంట పడకుండా కోటు లోపలి వైపు జాకెట్‌లో పెట్టుకుని విమానం ఎక్కాడు. అమెరికా చేరిన తర్వాత ఎక్కడ ఉండాలి, సెకండ్‌ హ్యాండ్‌ మిషనరీ కోసం ఎవరినీ సంప్రదించాలనే వివరాలేం తెలియకుండానే అడుగులు మందుకు వేశారు.

మంచు చూసి
న్యూయార్క్‌ సిటీలో దిగిదిగగానే పాల మీగడ లాంటి తెల్లటి మంచును చూసి ఆశ్చర్యపోయారు అనిల్‌ అగర్వాల్‌. అయితే ప్రయాణంలో అనిల్‌ అగర్వాల్‌ పక్కసీట్లో కూర్చున్న మిస్టర్‌ కోటావాలాతో పరిచయమైంది. రాజస్థాన్‌లో దూరపు చుట్టరికం కూడా ఉండటంతో నేరుగా వాళ్లింట్లో దిగిపోయారు అనిల్‌ అగర్వాల్‌.

ఆరా తీశాం
తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చినందుకు ప్రతిగా రోజువారి ఇంటి పనిలో సాయం చేయడం, వాళ్ల పిల్లలను స్కూలుకు తీసుకెళ్లడం, టెన్సిస్‌ ఆటలో కంపెనీ ఇవ్వడం పనులు చేసేవారు అనిల్‌ అగర్వాల్‌. ఇక వచ్చి రానీ బ్రోకెన్‌ ఇంగ్లీష్‌లో సెకండరీ మిషనరీ కోసం రోజుకు కనీసం 40 నుంచి 50 వరకు కాల్స్‌ చేసి వివరాలు సేకరించేవారు. 
చదవండి: ఇంగ్లీష్‌ రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఇప్పుడు రూ.33 వేల కోట్లకు అధిపతి

మంచి పండ్లు కావాలంటే
మొక్కను లోతుగా నాటినప్పుడే దాని మంచి పండ్లను పొందగలుతాము. మంచి పనులు చేసుకుంటూ పోతే మంచి ఫలితాలు కూడా వాటంతట అవే వస్తాయి. అలా శ్రమించడం వల్లే విజయాలు తనను వరించాయని చెబుతున్నారు అనిల్‌ అగర్వాల్‌ ( అయిపోలేదింకా...)

చదవండి: ఆ నిర్ణయంతోనే నా దశ తిరిగింది.. లేదంటే.. ఆ కథే వేరుగా ఉండేది

మరిన్ని వార్తలు