‘స్మార్ట్‌ఫోన్ ‌- ఆవు’ కథనంపై షావోమి స్పందన

24 Jul, 2020 19:59 IST|Sakshi

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ సంక్షోభం కారణంగా ప్రాచుర‍్యంలోకి వచ్చిన పిల్లల ఆన్‌లైన్‌ చదువుల కోసం కుటుంబ పోషణకు ఆధారణమైన ఆవును అమ్ముకున్న వైనంపై  ప్రముఖ మొబైల్‌ తయారీదారు షావోమి ఇండియా ఎండీ మను కుమార్‌ జైన్‌ స్పందించారు. హృదయాన్ని కదిలించే అంశమంటూ ఆ కుటుంబానికి సాయం అందించేందుకు జైన్‌ ముందుకొచ్చారు. వివరాలు షేర్‌ చేయాల్సిందిగా ట్వీట్‌ చేశారు.వారి పిల్లల విద్యాభ్యాసానికి సాయం చేస్తామని కూడా ప్రకటించారు. ఈ సందర్బంగా స్మార్ట్‌ఫోన్‌ నిత్యావసరమైన వస్తువుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్‌ చదువులు, వర్క్‌ ఫ్రం హోం లాంటి వాటికి స్మార్ట్‌ఫోన్‌ చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. 

ఈ ట్వీట్‌కు నెటిజన్లు స్పందించడంతో షావోమి టీం బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించిందని జైన్‌ తెలిపారు. అలాగే బిడ్డల చదువుకు ఎలా సాయం చేయాలనేదానిపై చర్చిస్తున్నట్టు  తెలిపారు.  కాగా ఈ కథనంపై బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. (ఆ కథనంపై చలించిన సోనూసూద్‌)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా