రేకులుగా మార్చి.. లోదుస్తుల్లో దాచి..

31 Oct, 2022 01:52 IST|Sakshi

మూడున్నర కేజీల బంగారం పట్టివేత  

చౌటుప్పల్‌ రూరల్‌: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద మూడున్నర కేజీల బంగారం పట్టుబడింది. రూ.1.90కోట్ల విలువైన బంగారాన్ని ఆది వారం తెల్లవారుజామున ఎస్‌ఎస్‌టీ(స్టాటిస్టికల్‌ సర్వేలెన్స్‌ టీం) అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన హర్షద్, షరీఫ్, జావేద్, సుల్తానా దుబాయ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు.

మూడున్నర కిలోల బంగారాన్ని ద్రవరూపంలోకి మార్చి సన్నని రేకులుగా ప్యాక్‌ చేసి అండర్‌వేర్‌లలో ఉంచుకొని విమానంలో ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఎర్టిగా కారులో హైదరాబాద్‌కు వస్తుండగా,  పంతంగి టోల్‌గేట్‌ చెక్‌పో స్టు వద్ద పోలీసులకు తనిఖీలో పట్టుబడ్డారు. వారి నుంచి బంగారం, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు నిమిత్తం డీఆర్‌ఐ అధికారులకు అప్పగించారు. కాగా, పోలీసులు వీరిని బంగారం స్మగ్లింగ్‌ ముఠా గా అనుమానిస్తున్నారు. వీరు దుబాయ్‌  ఎలా వెళ్లా రు, బంగారం ఎవరిచ్చారు, ఎయిర్‌ పోర్టులను దా టుకుంటూ ఇక్కడి వరకు ఎలా వచ్చారు, లేదంటే గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎవరైనా బంగారం ఇచ్చారా అనేది ఆరా తీస్తున్నారు.  

మరిన్ని వార్తలు