అన్న పెద్దకర్మ రోజే తమ్ముడి మృతి 

11 Apr, 2021 14:24 IST|Sakshi
సాయన్న భౌతికకాయానికి నివాళి అరి్పస్తున్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య

సాక్షి, చేవెళ్ల: అన్న పెద్ద కర్మరోజున తమ్ముడు వ్యవసాయ బావిలో స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని హస్తేపూర్‌ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం... హస్తేపూర్‌ గ్రామానికి చెందిన కుంటనోళ్ల అనంతయ్య అనారోగ్యంతో వారం రోజుల కిందట మృతి చెందాడు.

దీంతో శుక్రవారం ఆయన కుటుంబసభ్యులు దశదిన కర్మ కార్యక్రమాలు చేస్తున్నారు. మృతుడి తమ్ముడు కుంటనోళ్ల సాయన్న (52) గుండు చేయించుకుని పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. బావిలో దూకిన అతడు ఈత కొడుతూనే మునిగిపోయాడు. గమనించిన గ్రామస్తులు బావిలో వెతికారు బావిలో నీళ్లు ఎక్కువగా ఉండటంతో అతన్ని పైకి తీయలేకపోయారు. సాయంత్రానికి మృతదేహం నీటిపై తేలింది. మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సాయన్న భౌతికకాయానికి నివాలులరి్పంచారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు