టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్‌

8 Nov, 2022 19:29 IST|Sakshi

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన సూత్రధారి రామచంద్రభారతి అలియాస్‌ సతీశ్‌ శర్మపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గత నెలలో మొయినాబాద్‌ పోలీసులు రామచంద్రభారతి, సింహయాజితోపాటు నగరానికి చెందిన నందుపై కేసులు నమోదు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా, రామచంద్రభారతి తనకు రెండు డ్రైవింగ్‌ లైసెన్సులు, రెండు పాన్‌కార్డులు, రెండు ఆధార్‌ కార్డులు చూపించి ప్రభుత్వంలో తాము ఏమైనా చేయగలమని చెబుతూ మోసం చేసేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రామచంద్రభారతిపై ఐపీసీ 467, 468, 420, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచడం గమనార్హం. 
చదవండి: గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి?

మరిన్ని వార్తలు