ప్రముఖ నగల వ్యాపారికి ఈడీ భారీ షాక్‌!

3 Nov, 2020 13:55 IST|Sakshi

ఈడీ చరిత్రలోనే భారీ జరిమానా

 సాక్షి,న్యూఢిల్లీ:  హాంకాంగ్‌ డైమండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ఫెమా  కేసులో జ్యువెల్లరీ సంస్థ యజమాని,  ప్రముఖ వ్యాపారి సుఖేష్‌ గుప్తాకు భారీ షాక్‌ తగిలింది. విదేశీ సంస్థలతో అక్రమ లావాదేవీలు నిర్వహించిన  ఆరోపణలతో సంస్థ యజమానికి ఈడీ భారీ జరిమానా విధించింది. బంగారం దిగుమతుల్లో వంద కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడ్డ కేసులో ఎంబిఎస్ జ్యువెల్లర్స్ యజమాని సుఖేష్‌గుప్తాకు రూ.222.44 కోట్ల భారీ జరిమానా విధిందిచింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం  ఆదేశాలు జారీ చేసింది.  దీంతో  భారత ఈడీ చరిత్రలోనే  ఒక సంస్థకు విధించిన అతిపెద్ద జరిమానాగా నిలిచింది.

ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీతో వ్యాపార లావాదేవీలు నిర్వహించిన కేసులో ఈడీ ఈ జరిమానా నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌కు చెందిన లింక్‌ ఫై కంపెనీతో డైమండ్ల సరఫరా లావాదేవీలు కొనసాగించింది ఎంబీఎస్ జ్యువెల్లరీస్. తద్వారా విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించారు సుఖేష్‌ గుప్తా. సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిపిన ఈడీ చివరికి సంస్థ చరిత్రలో అతి భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం వెలువరించింది.

మరిన్ని వార్తలు