అదనపు వడ్డీ కోసం దళిత మహిళను వివస్త్రను చేసి.. మూత్రం తాగించి..  

25 Sep, 2023 11:38 IST|Sakshi

పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లా మొశింపుర్ గ్రామంలో ఖుర్సుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రూ.1500 అదనపు వడ్డీ చెల్లించాలంటూ తండ్రీ కొడుకులు ఒక దళిత మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను వివస్త్రను చేసి కర్రలతో చితకబాది బలవంతంగా ఆమెతో మూత్రం తాగించారు.

  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి భర్త ప్రమోద్ సింగ్ వద్ద రూ.9000 అప్పుగా తీసుకున్నారని ఆ నగదు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించినా కూడా రూ.1500 అదనంగా వడ్డీ చెల్లించాలని ప్రమోద్ సింగ్ పలుమార్లు వారిని వేధించాడన్నారు. భార్యభర్తలు ఇద్దరూ అప్పటికే మొత్తం అప్పు తిరిగి చెల్లించామని చెప్పి అదననపు వడ్డీ చెల్లించడానికి తిరస్కరించడంతో శనివారం ప్రమోద్ సింగ్ తన కుమారుడు అన్షు తోపాటు మరో నలుగురు ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా బయటకు లాక్కొచ్చి అందరూ చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేశారన్నారు. 

అనంతరం కర్రలతో చితకబాదాక ప్రమోద్ ఆదేశించగా అన్షు బలవంతంగా ఆమెతో మూత్రం తాగించాడు. అక్కడినుండి ఎలాగోలా తప్పించుకున్న ఆమె పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి తలకు తీవ్రగాయాలవ్వడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ప్రధాన నిందితుడు ప్రమోద్ సింగ్ అతని కుమారుడు అన్షు సహా మిగిలిన ఆనలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.             

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో క్షుద్రపూజలు.. నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్‌

మరిన్ని వార్తలు