ప్రేమించిన అమ్మాయే పెళ్లిని చెడగొట్టిందని..

29 Jul, 2021 12:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): తాను ప్రేమించిన అమ్మాయే తన పెళ్లిని చెడగొట్టిందనే అక్కసుతో యువతిని చంపేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు కటకటాలపాలైన సంఘటన నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. దేవరకొండ గ్రామానికి చెందిన రమేష్, సంధ్యలు భార్యభర్తలు. వీరిద్దరూ ఆయిల్‌సీడ్‌ కాలనీలోని క్వార్టర్స్‌లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. వీరితో పాటు రమేష్‌ చెల్లెలు అమలశాంతి వారి వద్దే ఉంటూ చ­దువుకుంటుంది. కొంతకాలం క్రితం సంధ్య త­మ్ముడు రాహుల్‌ కూడా వీరితోనే ఉండేవాడు.

అమలశాంతి, రాహుల్‌లు వరుసకు బావ మరదలు కావడంతో కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. ఇద్ద­రి మధ్య గొడవలు అయ్యి, పెద్దలకు కూడా తెలివ­డంతో మందలించారు. ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇదే సమయంలో రమేష్, సంధ్యల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో మిర్యాలగూడ పోలీసు స్టేషన్‌లో 498 సెక్షన్‌ కింద కేసు కూడా ఉంది. సంధ్య తన పుట్టింటి వద్దనే ఉంటుంది. రమేష్, అమలశాంతిలతో పాటు మరో బంధువైన చెన్నకేశవులు ఉంటున్నారు. ఇటీవల రాహుల్‌­కు పెళ్లి సంబంధం కుదిరింది. అయితే బంధువుల విచారణలో అమలశాంతితో జరిగిన ప్రేమా­యణా­న్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లికూతురు వాళ్లు సంబంధాన్ని రద్దు చేశారు.

కావాలనే నా పెళ్లి చెడగొట్టిందనే అక్కసుతో మంగళవారం ఉదయం సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరనుకున్న రాహుల్‌ అమలశాంతిని చంపేందుకు కుట్ర పన్నాడు. వెంట ఒక చున్నీ, చేతులకు గ్లౌజులను తెచ్చుకున్నాడు. డో­ర్‌ లాక్‌ చేసిన తర్వాత బయటకొచ్చిన అమలశాంతిని చున్నీతో మెడను గట్టిగా నులిమే ప్రయత్నం చేశాడు. అమల శాంతి బిగ్గరగా కేకలు వేయడంతో లోపల ఉన్న చెన్నకేశవులు వ­చ్చాడు. అంతే క్షణాల్లో రాహుల్‌ అక్కడ నుంచి పరారైయ్యాడు. మంగళవారం యువతి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు