పోలీస్‌ అధికారిణికే తప్పని వేధింపులు...కీచక పోలీస్‌ అరెస్టు

14 Sep, 2022 15:14 IST|Sakshi

ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, చిన్నారులు లైంగిక వేధింపులు గురువుతూనే ఉంటున్నారు. సాధారణ మహిళలకే ఈ వేధింపులు అనుకుంటే తప్పే అవుతుంది. మహిళా పోలీసులు కూడా అందుకు అతీతం కాదు. ఇక్కడొక కీచక పోలీసు సాక్షాత్తు మహిళా పోలీస్‌ అధికారినే వేధింపులకు గురి చేసి కటకటాలపాలయ్యాడు.

వివరాల్లోకెళ్తే...ఒక అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహిళా పోలీసు అధికారిని లైంగిక వేధింపులకు గురిచేస్తూ... అసభ్యకరమైన సందేశాలు పంపించి బెదింపులకు గురి చేశాడు. దీంతో సదరు వ్యక్తి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. మహిళా పోలీస్‌ అధికారి ఫిర్యాదు మేరకు నిందితుడుని దీపక్‌ దేశముఖ్‌గా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సదరు మహిళా అధికారి నిందితుడిపై ఫిర్యాదులు చేసినందుకే కోపంతో అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ సందేశాలు పంపిచనట్లు అధికారిక వర్గాల సమాచారం. 

(చదవండి: అత్తారింటికి వెళ్లి కాల్పులు.. ఘరానా భర్త హల్‌చల్‌)

మరిన్ని వార్తలు