గాంధీ ఆస్పత్రి ఘటన.. సంచలన విషయాలు వెలుగులోకి

19 Aug, 2021 16:15 IST|Sakshi

అత్యాచారం జరగలేదని తేల్చిన పోలీసులు

నారాయణగూడలో మహిళ ఆచూకీ లభ్యం

పోలీసుల విచారణలో బయటికొచ్చిన నిజాలు

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  గాంధీ ఆస్పత్రి ఘటన అంతా ఫేక్‌ అని పోలీసులు తెలిపారు. అత్యాచారం జరగకున్నా యువతి కట్టుకథలు అల్లినట్లు పోలీసులు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి ఘటనలో ఇద్దరు మహిళలు చెప్పిన ఫిర్యాదులో వాస్తవం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరి అక్కా చెల్లెలకి కెమికల్ కలిపిన కల్లు తాగే అలవాటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న కొద్ది రోజులు కల్లు తాగకపోయే సరికి ఇద్దరూ చాలా స్ట్రెస్‌లో ఉన్నట్లు వెల్లడించారు.
చదవండి: 
గాంధీ హాస్పిటల్ సీసీ ఫుటేజీలో బయటపడ కీలక సాక్ష్యాలు

ఈ క్రమంలో ఇద్దరిలో అక్క బయటికి వెళ్ళిపోయిందని,  ఇద్దరూ ఎదుట వ్యక్తికి గుర్తు పట్టే స్థితిలో లేరన్నారు. అక్కని వెతుకు కుంటూ వెళ్ళిన చెల్లి బయట ఓ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతూ పరిచయం చేసుకుందని, ఇది జరిగిన రోజే సెక్యూరిటీ గార్డుతో పరస్పర అభిప్రాయంతో లైంగికంగా 7వ ఫ్లోర్‌లో కలిసినట్లు తెలిపారు. ఆ తరువాత మరొకసారి సెల్లార్‌లో మళ్లీ పరస్పర అభిప్రాయంతో లైంగికంగా ఇద్దరు కలిసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయం ఇంట్లొ తెలిస్తే బాగోదు అని అమ్మాయి ఇలా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.  ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన అక్క కూడా రెండూ రోజులు పాటు కాగితాలు ఏరుకునే వ్యక్తి తో ఉందని, అక్కడ ఏం జరిగింది అని వివరణ లేదని తెలిపారు. దీనిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ తప్పు ఏం లేనట్లు పోలీసులు తెలిపారు. 

కాగా గాంధీ ఆస్పత్రిలో అక్కా చెల్లెళ్ల సామూహిక అత్యాచార ఘటనపై సీపీ అంజనీ కుమార్ స్పందించారు. 500కి పైగాసీసీ కెమెరాలు పరిశీలించినట్లు ఆయన తెలిపారు. 800 గంటల సీసీ ఫుటేజ్‌లు చూడటం జరిగిందని, టెక్నాలజీ ఆధారంగా.. సెల్ ఫోన్ సిగ్నల్స్ చూసినట్లు పేర్కొన్నారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అని ఆయన అన్నారు. క్రైమ్ విషయంలో మహిళల గురించి తప్పుగా మాట్లాడకూడదని, పార్లమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. 

క్రైమ్‌లో సీన్ రీ క్రియేషన్ చాలా ముఖ్యమని, ప్రతి వ్యక్తికి పర్సనల్ విషయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. లా ప్రకారం.. ఏసీపీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ చేయాలి, ఈ కేసులో మిస్టరీ ఏం లేదన్నారు. కోర్టులో కేసు వివరాలు ఎలా సబ్మిట్ చేయాలి అని చూస్తున్నట్లు వెల్లడించారు.

కాగా, గాంధీ ఆసుపత్రిలో తనతోపాటు తన సోదరిపైనా సామూహిక అ‍త్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నార్త్‌ జోన్‌ పోలీసులు 10 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా మహిళను నారాయణగూడలో ఉన్నట్లు గురువారం గుర్తించారు. అదృశ్యమైన మహిళ రెండు రోజులుగా ఓ వ్యక్తితో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, మహిళకు ఆశ్రయం ఇచ్చిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.

చదవండి: తాలిబన్ల రాకకు ముందు అఫ్గన్‌

మరిన్ని వార్తలు