గాంధీ వర్ధంతి: మాంసం కోసం కొట్టుకున్న యువకులు

1 Feb, 2022 08:23 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకులు

సాక్షి, రాయచూరు (కర్ణాటక): మాంసం కొనుగోలు విషయంలో చిన్నపాటి ఘర్షణ జరిగి 21 మంది గాయపడిన ఘటన ఆదివారం రాయచూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు... మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్‌ చేశారు. సాయంత్రం నీరుబావి కుంటలో మాంసం దుకాణాలు తెరవడంతో శివప్ప, సూర్య ప్రకాశ్‌లు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాంసం కొనుగోలు సందర్భంగా చిన్నపాటి గలాటా జరిగింది.

దీంతో ఇద్దరు వారి స్నేహితులకు సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున యువకులు అక్కడికి చేరుకుని కొట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు.    

చదవండిః సిద్ధు భస్మాసురుడు వంటి వాడు

మరిన్ని వార్తలు