రు.600 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

16 Nov, 2021 05:01 IST|Sakshi

అహ్మదాబాద్‌: అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ మాదక ద్రవ్యాలను గుజరాత్‌ ఉగ్ర వ్యతిరేక బృందం స్వాధీనం చేసుకుంది. కేసులో ముగ్గురిని అరెస్ట్‌చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని దేశానికి తరలించేందుకు పాకిస్తాన్‌కు చెందిన జహీద్‌ బషీర్‌ బలూచ్‌ అనే వ్యక్తి నుంచి 120 కేజీల హెరాయిన్‌ను ఈ ముగ్గురు తెప్పించారని పోలీసులు వెల్లడించారు. మోర్బీ జిల్లాలోని జింజువా గ్రామంలో ఈ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ ఆశిశ్‌ భాటియా చెప్పారు.

మరిన్ని వార్తలు