కేజీఎఫ్‌–2 చూస్తూ రచ్చ రచ్చ... థియేటర్లో కాల్పులు

21 Apr, 2022 06:26 IST|Sakshi

యశ్వంతపుర (కర్ణాటక): తెరపై కేజీఎఫ్‌2 నడుస్తోంది. హీరో, విలన్ల మధ్య భారీ కాల్పులు, పోరాట దృశ్యాలు చూస్తూ ప్రేక్షకులు మైమరచిపోయారు. కానీ అవే కాల్పులు ఉన్నట్టుండి థియేటర్లోనే తమ కళ్ల ముందే జరగడంతో అంతా భయంతో పరుగులు తీశారు. కర్ణాటకలో హావేరి జిల్లా శిగ్గావి పట్టణంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

సెకండ్‌ షో చూస్తుండగా వసంతకుమార అనే ప్రేక్షకుని కాలు ముందు కుర్చీలో కూర్చున్న వ్యక్తికి తగిలింది. దాంతో గొడవ పడ్డారు. అతను బయటకు వెళ్లి పిస్టల్‌తో తిరిగొచ్చి ఏకంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండు తూటాలు వసంత కాలు, కడుపులోకి దూసుకెళ్లాయి. దుండగుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు