దారుణం: పెళ్లైన మూడు నెలలకే.. నడిరోడ్డుపై

7 Jul, 2021 19:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య గొడవ కారణంగా.. ఒకరి నిండు ప్రాణం కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జలాన్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓరై ప్రాంతానికి చెందిన సదరు యువకుడు, తన సమీప గ్రామంలోని యువతిని వివాహం చేసుకున్నాడు. కాగా, పెళ్లి  అయిన మూడు నెలలకే వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో యువతి భర్త ప్రతి రోజు ఆమెను కొడుతూ, హింసించేవాడు.

ఈక్రమంలో, ఒకరోజు ఆమెను ఓరై రోడ్డుపై తీసుకొచ్చి పెట్రోల్‌ పోసి నిప్పంటిచాడు. దీంతో ఆ యువతి మంటల్లో అరుస్తు రోడ్డుపై కుప్పకూలిపోయింది. ఆయువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ యువతి రెండున్నర గంటలపాటు కాలిన గాయలతో హైవే పైనే ఉంది. కాసేపటికి, ఒక దాబా యజమాని ఆ బాధితురాలిని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.

దీంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఝాన్సీ ఆసుపత్రికి తరలించారు. కాగా, తన భర్త ఈ దారుణం చేశాడని బాధితురాలు ఆరోపించింది. కాగా,  కేసును నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని జలాన్‌ పోలీసు అధికారి రాకేశ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు