చంపుతామని బెదిరించారు: బీజేపీ కార్యకర్తలపై ఏఎస్సై ఫిర్యాదు 

24 Aug, 2021 09:09 IST|Sakshi

వీణవంక (హుజూరాబాద్‌): కరీంనగర్‌ జిల్లాలో మాజీమంత్రి ఈటల రాజేందర్‌ పర్యటన సందర్భంగా విధి నిర్వహణపై వెళ్లిన ఏఎస్సై బాపిరెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వీణవంక మండలం వల్భాపూర్‌ గ్రామంలో సోమవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఈటల రాజేందర్‌ పర్యటనలో గొడవలు జరగకుండా చూసేం దుకు విధుల్లో భాగంగా బాపిరెడ్డి వల్భాపూర్‌ వెళ్లారు. అక్కడ దొమ్మాటి రాజమల్లు ఇంటివద్ద కార్యకర్తలతో ఈటల సమావేశ మయ్యారు. ఈక్రమంలో బాపిరెడ్డి అక్కడ విధులు నిర్వర్తిస్తుండగా బీజేపీ కార్యకర్తలు ఇక్కడికెందుకు వచ్చావ్‌ అంటూ అతడిపై దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో ఆయన మోటార్‌ సైకిల్‌ ధ్వంసం కాగా, ఆయన వేసుకున్న చొక్కా చిరిగిపోయింది. విధులకు ఆటంకం కలిగించడంతోపాటుగా తనను చంపుతామని బెదిరించినట్లు ఏఎస్సై  ఫిర్యా దు చేయగా.. బీజేపీ కార్యకర్తలు జీడి రాజు, దొమ్మాటి రాజమల్లు, నలుబాల మధు, మారముల్ల సదయ్య, నామిని విజేందర్, రాయిని శివయ్య, జీడి మోహన్, దొమ్మాటి శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు