ప్రేమించి పెళ్లి, భార్య వేలు కట్‌చేసి పారిపోయిన భర్త

13 Oct, 2021 08:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బంజారాహిల్స్‌: ప్రేమించి పెళ్లి  చేసుకున్న ఓ యువకుడు అదనపు కట్నం  కోసం భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబైలో నివసించే హసి (22), జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరికి చెందిన రవి నాయక్‌ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. రవి నాయక్‌ ఇటీవల ఆమెను పెళ్లి చేసుకొని నగరానికి తీసుకొచ్చాడు. హసి బ్యూటీషియన్‌గా పని చేస్తుండగా రవినాయక్‌ ఖాళీగా ఉన్నాడు. ఈ నెల 10వ తేదీన తనకు రూ. 50 వేలు కావాలంటూ రవి నాయక్‌ భార్యను అడగగా లేదనడంతో తీవ్రంగా కొట్టి కత్తితో ఓ వేలిని కట్‌ చేసి పారిపోయాడు. మరోసటి రోజు ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రవి నాయక్‌పై కేసు నమోదు చేశారు.

మద్యానికి బానిసై ఆత్మహత్య
సినీ పరిశ్రమలో క్యాస్ట్యూమ్‌  డిజైనర్‌గా పని  చేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌ సమీపంలోని సింధు టిఫిన్‌ సెంటర్‌ సమీపంలో అద్దెకుంటున్న తారకేశ్వర్‌రావు (42),  సినీ క్యాస్ట్యూమ్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసై డబ్బుల కోసం భార్యతో గొడవ పడుతుండేవాడు రెండ్రోజుల క్రితం తన గదిలోకి వెళ్లి  ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: కర్కశ తల్లి లక్ష్మీ అనూష అరెస్టు.. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే

మరిన్ని వార్తలు