ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. యువతితో సహజీవనం.. చివరికి ఊహించని ట్విస్ట్‌

17 Mar, 2023 13:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ (బంజారాహిల్స్‌): ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అని యువతితో సహజీవనం చేసి..గర్భందాల్చాక నమ్మక ద్రోహానికి పాల్పడటమే కాకుండా అబార్షన్‌ చేయించుకోకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తానని బెదిరించిన యువకుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లోని ఎన్బీటీ నగర్‌లో నివసించే యువతి(22) ప్రైవేట్‌ జాబ్‌ చేస్తోంది. 2020లో వరంగల్‌ జిల్లాకు చెందిన  కాంట్రాక్టర్‌ బూక్యా కల్యాణ్‌(25)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది.

ప్రేమ పేరుతో ఇద్దరూ షికార్లు కొట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె కల్యాణ్‌తో  శారీరక సంబంధాలు కూడా కొనసాగించింది.  ఈ నేపథ్యంలోనే ఆమె గర్భందాలి్చంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అతను అబార్షన్‌ చేయించుకోవాలని, లేకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత వారం రోజులుగా ఆమె ఫోన్‌ చేస్తే స్పందించడంలేదు. దీంతో బాధితురాలు వరంగల్‌లోని కల్యాణ్‌ స్వగ్రామానికి వెళ్లి ఆరా తీయగా.. అప్పటికే మరో యువతితో కల్యాణ్‌కు వివాహ నిశ్చితార్థం జరిగిందని,  త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని తెలిసింది. తనను ఎందుకు మోసం చేశావని ప్రశ్నించగా రూ.10 లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటానని డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 493, 420, 417,313 506, వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు