ఖమ్మంలో రాజకీయ హత్య కలకలం?.. తుమ్మల ప్రధాన అనుచరుడి దారుణ హత్య

15 Aug, 2022 12:42 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లా రాజకీయాల్లో ఓ దారుణ హత్య కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడి తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో కొడవళ్లతో దారుణంగా హతమార్చారు దుండగులు. 

ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు అవుతాడు కృష్ణయ్య. అయితే..
 
సీపీఎంతో విభేదించి.. టీఆర్‌ఎస్‌లో చేరాడు కృష్ణయ్య. ఆపై తుమ్మలకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఈ హత్యోదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

ఇదీ చదవండి: దారుణాతీ దారుణం .. దళిత చిన్నారిని కొట్టి చంపిన టీచర్‌

మరిన్ని వార్తలు