అసభ్యంగా కామెంట్లు.. అపరకాళిలా మారి చెప్పుతో కొట్టింది

27 Aug, 2022 14:05 IST|Sakshi

న్యూఢిల్లీ: రద్దీగా ఉండే నడిరోడ్డుపై ఓ మహిళ ఒక వ్యక్తిని కిందపడేసి చెప్పుతో చితకొట్టేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...రోడ్డుపై వెళ్తున్న ఆమె పట్ల సదరు వ్యక్తి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అపరకాళిలా మారి అతని పై దాడి చేసింది.

రహదారిపై ఉన్నవారంతా చూస్తుండగానే కిందపడేసి చెప్పుతో చితక బాదేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిద్దర్నీ అడ్డుకుని పోలీస్టేషన్‌కి తరలించారు. ఈ మేరకు పోలీస్‌ అధికారి అనూప్‌ సింగ్‌ సదరు వ్యక్తులను విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

(చదవండి: బ్యాగ్‌లో 15 ఏళ్ల బాలిక మృతదేహం)

మరిన్ని వార్తలు