దారుణం: భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో..

19 Jun, 2021 09:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో దాడిచేశాడు. ఈ ఘటనలో భార్య ప్రియుడు మృతి చెందగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గొనెగండ్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు అనే వ్యక్తి భార్య ఉరుకుందమ్మ గత కొన్నాళ్లుగా బజారీ అనే వ్యాక్తితో సహజీవనం చేస్తోంది.

దీంతో కోపం పెంచుకున్న నాగరాజు వారిద్దరిపై కత్తి, బండరాళ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బజారీ అక్కడికక్కడే మృతి చెందగా, ఉరుకుందమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు అక్రమ సంబంధమే కారణం అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితుడు నాగరాజు కోసం గాలిస్తున్నారు.
చదవండి: వైఎస్సార్‌ కడప: యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు