ఫ్రెండ్‌ కోసం కారులో యువతి.. లోనికి చొరబడ్డ దుండగుడు

9 Jul, 2021 17:23 IST|Sakshi

ముంబై : కారులోకి చొరబడ్డ ఓ దుండగుడు యువతిపై కత్తితో డాడి చేశాడు. యువతి మెడలోని చైన్‌ కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని ముంబై చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత బుధవారం ముంబైలోని సియాన్‌కు చెందిన సీజల్‌ ఠాకూర్‌ ఈస్ట్రన్‌ ఎ‍క్స్‌ప్రెస్‌ వద్ద ఉన్న సర్వీస్‌ రోడ్డుపై తన కారు ఆపి స్నేహితురాలికోసం ఎదురు చూడసాగింది. అప్పడు సమయం ఉదయం 11.30 నిమిషాలు. ఇంతలో ఓ వ్యక్తి కారుడోరు తెరిచి లోపలికి దూరాడు.

కత్తి చూపించి మెడలో ఉన్న గొలుసు, పర్సులోని డబ్బు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు. ప్రతిఘటించిన సీజల్‌ అతడితో గొడవకు దిగింది. దీంతో అతడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతరం మెడలోని గొలుసు లాక్కుని అక్కడినుంచి పరారయ్యాడు. దీనిపై బాధితురాలు నవ్‌ఘర్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు