వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని స్నేహితుడినే..

4 May, 2022 11:16 IST|Sakshi

శివమొగ్గ: సొరబకు చెందిన లేఖప్ప (28) అనే వ్యక్తిని కృష్ణప్ప (30) హత్య చేశాడు. మన్మనే గ్రామానికి చెందిన లేఖప్ప సొరబకు వచ్చి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లేఖప్ప ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా అతని స్నేహితుడు అయిన కృష్ణప్పను అదుపులోకి తీసుకొని విచారించగా తానే చంపినట్లు చెప్పాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పట్టణానికి పిలిపించి హత్య చేసి శవాన్ని పొలాల్లో పడేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, శివమొగ్గ దగ్గర గురుపురలో గౌడప్ప (35) అనే ప్రైవేటు ఉద్యోగి బైక్‌పై వెళ్తుండగా గూడ్స్‌ వ్యాన్‌ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందాడు.

వరకట్న వేధింపులు, మరో అబల బలి 
మైసూరు: వరకట్న వేధింపులకు మరో అబల బలైన సంఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హిమ్మావు గ్రామంలో చోటు చేçసుకుంది. గ్రామానికి చెందిన ఉమేష్, బేబి (29)కి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అప్పుడప్పుడు దంపతుల మధ్య కట్నం విషయంగా గొడవలు జరిగేవి. ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున బేబి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డబ్బు కోసం వేధించడం వల్లనే బేబి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

(చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..)

మరిన్ని వార్తలు