పెళ్లై విడాకులు.. బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం.. అనుమానంతో

3 May, 2022 19:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఘజియాబాద్‌: మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో మహిళను ఆమె ప్రియుడే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ(30) పెళ్లై భర్తతో విడాకులు తీసుకుంది. అనంత‌రం ఆమె త‌న ప్రియుడితో కలిసి స‌హ‌జీవ‌నం చేస్తోంది. అయితే మ‌హిళకు వేరొక‌రితో ఎఫైర్‌ ఉందని, త్వరలో అత‌డిని పెళ్లి చేసుకోబోతుందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన నిందితుడు తన ప్రియురాలిని హత్య చేశాడు.

అనంతరం మృతదేహాన్ని గోనెసంచీలో వేసి నిర్మానుష్య ప్రాంతంలో ప‌డేశాడు. మృతురాలికి చెందిన టీవీ, ఇత‌ర వ‌స్తువుల‌తో నిందితుడు ఉడాయించాడు. ఏప్రిల్‌ 29న ఘజియాబాద్‌లోని సరిహద్దు ప్రాంతంలో గోనె సంచిలో మహిళా మృతదేం లభ్యమైంది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.  48 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

చదవండి: పనికోసం ఇంటికొస్తే వ్యభిచారం చేయించారు..

మరిన్ని వార్తలు