కామంతో కళ్లు మూసుకుపోయి.. వావి వరసలు మరిచిపోయి..

4 Aug, 2022 07:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వేలూరు(తమిళనాడు): కామంతో కళ్లు మూసుకుపోయాయి. వరసలు మరిచిపోయాడు. కన్న కూతురుపై లైంగిక దాడి చేసి గర్భిణిని చేశాడు. విషయం బయట పడడంతో పోలీసులు కామాంధుడిని అరెస్ట్‌ చేశారు. వివరాలు.. వేలూరు జిల్లా విరింజిపురం గ్రామానికి చెందిన 45 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి వెల్డింగ్‌ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.
చదవండి: షాకింగ్‌ క్రైమ్‌.. భర్త అలా చేశాడని.. భార్య దారుణం!

ఇతని భార్య ఎనిమిది ఏళ్ల క్రితం వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. ఇతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 13 ఏళ్ల కుమార్తె అదే గ్రామంలోని తాతయ్య ఇంట్లో పెరుగుతోంది. ప్రతి రోజూ తాతయ్య ఇంటి నుంచి తండ్రికి భోజనం తీసుకువచ్చేది. గత సోమవారం ఉదయం బాలికకు కడుపు నొప్పి రావడంతో వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో గర్భిణిగా తేలింది. ఈ క్రమంలో బాలికకు శస్త్ర చికిత్స చేసి మగబిడ్డను బయటకు తీశారు. వైద్య సిబ్బంది బాలికను ఆరా తీయగా వివాహం జరగలేదని తెలిసింది. దీంతో వైద్యులు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ జరిపారు. గర్భం రావడానికి కన్న తండ్రే కారణమని బాలిక తెలపడంతో పోలీసులు అతన్ని పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం వేలూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.    

మరిన్ని వార్తలు