పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్‌!

12 May, 2022 09:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కెలమంగళం(బెంగళూరు): పెళ్లయిన కొద్దిరోజులకే నూతన వధువును కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని అంచెట్టి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంచెట్టి సమీపంలోని మావనట్టి గ్రామానికి చెందిన వేలు. ఇతనికి భువనేశ్వరి (21)తో గత 4వ తేదీ పెళ్లి జరిగింది. గత రెండు రోజుల భువనేశ్వరి భర్త ఇంటి నుంచి పుట్టింటికొచ్చి అదృశ్యమైంది. అంచెట్టి సమీపంలోని బయల్‌కాడు గ్రామానికి చెందిన దేవరాజ్‌ (22), భువనేశ్వరి గతంలోనే ప్రేమించుకొన్నట్లు, ఆమెను అతడు తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీసులు వారిని గాలించి పట్టుకొని భవనేశ్వరిని ఆమె భర్తకు అప్పగించారు. దేవరాజ్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

మరో ఘటనలో..
ఉపాధ్యాయ దంపతుల దుర్మరణం 
తుమకూరు: రోడ్డు ప్రమాదంలో గుబ్బి తాలూకాకు చెందిన ఈశ్వరప్ప(52), కల్పన(48) అనే ఉపాధ్యాయ దంపతులు మృతి చెందారు. గుబ్బిలోని ప్రైవేటు స్కూల్లో ఈశ్వరప్ప, ప్రభుత్వ పాఠశాలలో కల్పన పనిచేస్తున్నారు. బుధవారం వీరు కారులో తుమకూరు వైపు నుంచి గుబ్బి వైపు వెళ్తుండగా మల్లసంద్ర వద్ద రోడ్డు పక్కగా ఉన్న లారీని ఢీ కొన్నారు. తీవ్రంగా గాయపడిన  దంపతులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. తుమకూరు గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: నాగరాజుతో వివాహేతర సంబంధం.. తల్లీకొడుకు మధ్య గొడవలో..

మరిన్ని వార్తలు