కిడారి హత్యకేసులో సప్లిమెంటరీ చార్జిషీట్‌

12 Jun, 2021 17:53 IST|Sakshi

విజయవాడ లీగల్‌: విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యకేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం విజయవాడ నగర మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసింది. 2018లో అప్పటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఎన్‌ఐఏ 59 మందిని నిందితులుగా పేర్కొంది.

నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించడంతో జైలులో ఉన్నారు. ఈ కేసులో 59వ నిందితురాలైన సాకే కళావతి అలియాస్‌ భవానీపై సప్లిమెంటరీ చార్జిషీటును దాఖలు చేశారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కాకూరి పెద్దన్న భార్య, మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలైన కళావతి హత్య చేసిన సమయంలో ఇన్సాస్ రైఫిల్‌తో పాటు పలు మారణాయుధాలను కళావతి ధరించిందని, కిడారి, సివిరి హత్యలకు పదిహేను రోజుల ముందు డుంబ్రిగూడలో రెక్కీ, బస చేసారని ఎన్ఐఏ తెలిపింది.

చదవండి: ఇసుక రీచ్‌ల సబ్‌ లీజుల పేరిట భారీ మోసం

మరిన్ని వార్తలు